ఇంటింటా ఇన్నోవేషన్స్ కు నలుగురు ఎంపిక

by Shyam |
ఇంటింటా ఇన్నోవేషన్స్ కు నలుగురు ఎంపిక
X

దిశ, సంగారెడ్డి : ఇంటింటా ఇన్నోవేటర్స్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని పలువురు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించగా నలుగురు ఎంపికయ్యారని జిల్లా సైన్స్ అధికారి విజయ్ కుమార్ తెలిపారు. జిల్లా నుండి ఎంపికైన అభ్యర్థులు వారి ఇన్నోవేషన్స్ ను ఆదివారం నాడు సంగారెడ్డి పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరుగబోయే స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ప్రదర్శిస్తారని ఆయన తెలిపారు. వ్యవసాయ విభాగంలో కళాశాల విద్యార్ధి దీపక్ రెడ్డి భూమిని శుభ్ర పర్చడానికి, సమం చేయడానికి రాక్ ఫికర్ యంత్రాన్ని తయారు చేశారని వెల్లడించారు.

క్రీడల విభాగంలో కళాశాల విద్యార్ధి నితిన్ దశల ద్వారా భరించగలిగే బ్యాగ్, స్లైడర్‌గా ఉపయోగించగల బహుళార్ధసాధక బరువు హోల్డరును తయారు చేసినట్లు పేర్కొన్నారు. భద్రత, జాగ్రత్తల విభాగంలో ప్రిన్సిపాల్ వి. సౌజన్య కనురెప్పల కదలికను విశ్లేషించడానికి పరికరం, మగతని గుర్తించడానికి ఆవలింతలు అనేదానిపై ప్రదర్శన ఇవ్వనున్నారు. అదేవిధంగా అనుకూలీకరించదగిన మల్టీక్రాఫ్ సీడ్, ఎరువుల డ్రిల్లర్ అనే అంశంపై ప్రతాప్ అనే వ్యక్తి ఇన్నోవేషన్స్ ను ప్రదర్శించనున్నారని విజయ్ కుమార్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed