- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫోర్ట్‌నైట్ గేమ్.. డౌన్‌లోడ్ ఎలా?
పాపులర్ గేమింగ్ యాప్ ‘ఫోర్ట్ నైట్’ను ఆపిల్, గూగుల్ రెండు కూడా తమ యాప్ స్టోర్ నుంచి తొలగించాయి. తమ పాలసీలను ఉల్లఘించినందుకు ఈ గేమింగ్ యాప్‌ను తొలగించినట్లు సదరు సంస్థలు పేర్కొన్నాయి. అయితే, ఈ గేమ్ యాప్‌నకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 350 మిలియన్ల యూజర్లు ఉన్నారు. కాగా, ఈ యాప్‌ను తొలగించినప్పటికీ ఆండ్రాయిడ్ యూజర్లు ఇప్పటికీ ఈ గేమ్‌ను డౌన్‌లోడ్ చేసి ఆడుకోవచ్చు. అది కూడా అధికారికంగానే. కాకపోతే, ఇది ప్లే స్టోర్‌లో లభించదు. అందుకోసం ఏం చేయాలంటే..
1. ‘ఎపిక్ గేమ్స్’(epic game) స్టోర్ వెబ్‌సైట్‌కు వెళ్లి.. ‘ఫోర్ట్ నైట్(fortnite) అని సెర్చ్ చేయాలి. ఇది డెస్క్ టాప్ లేదా ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా కూడా చేయొచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఫోర్ట్‌నైట్.కామ్/ఆండ్రాయిడ్ విజిట్ చేయొచ్చు.
2. ఇప్పుడు ఎపిక్ గేమ్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయాలి.
3. ఆండ్రాయిడ్ యూజర్లు ఏపీకే ఫైల్‌ను వెబ్‌సైట్ నుంచి డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ చేయొచ్చు.
ఇదేకాక, శాంసంగ్ గెలాక్సీ యూజర్లు.. శాంసంగ్ యాప్ స్టోర్ నుంచి కూడా దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
1. గెలాక్సీ స్టోర్‌ను ఓపెన్ చేయాలి
2. ఫోర్ట్ నైట్ సెర్చ్ చేసి.. ఇన్‌స్టాల్ చేయాలి సింపుల్!