- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోహ్లీకి మర్యాద ఇవ్వలేదు.. బీసీసీఐపై పాక్ మాజీ స్పిన్నర్ అసంతృప్తి
దిశ, వెబ్‌డెస్క్: వైట్ బాల్ క్రికెట్ నుంచి కెప్టెన్సీగా కోహ్లీని తొలగించడంపై దుమారం రేగుతోంది. ముఖ్యంగా విరాట్ అభిమానులు బీసీసీఐపై దుమ్మెత్తి పోస్తున్నారు. లాబీయింగ్ జరిగింది అంటూ పలువురు ఆరోపించగా.. ఇంకొంత మంది ఐసీసీ ట్రోఫీలు సాధించకపోవడమే ప్రధాన కారణమని చెప్పుకొస్తున్నారు. ఇదే విషయంపై పలువురు అంతర్జాతీయ క్రికెటర్లు సైతం స్పందిస్తున్నారు. తాజాగా డానిష్ కనేరియా బీసీసీఐ తీరును తప్పుబట్టాడు.
తన యూ ట్యూబ్ చానల్‌లో మాట్లాడుతూ.. ‘కోహ్లీని కెప్టెన్సీ నుంచి బీసీసీఐ తప్పించి సరైన పనే చేసిందా అని నేను అలా అనుకోను. బీసీసీఐ విరాట్‌కు గౌరవం ఇవ్వలేదు. అతడు వన్డే కెప్టెన్సీగా ఉండి భారత్‌కు అత్యధిక విజయాలు అందించాడు. కెప్టెన్‌గా తన రికార్డు ఏమాత్రం చెడ్డది కాదు. దీనికితోడు భారత వన్డే కెప్టెన్‌గా రెండో అత్యధిక పరుగులు సాధించిన రికార్డు అతనికి ఉంది. వన్డే క్రికెట్‌కు కోహ్లీ అర్హుడు. అతను కెప్టెన్‌గా ICC ట్రోఫీని గెలవలేదు కానీ అతను నడిపించిన విధానం అసాధారణమైనది’ అంటూ డానిష్ కనేరియా మద్దతు తెలిపాడు.