- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం కన్నుమూత
దిశ, భద్రాచలం: మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం (65) కన్నుమూశారు. బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆరోగ్యం విషమించి హైదరాబాద్ ఆసుపత్రిలో శనివారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లుగా బంధువులు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీపీఐ పార్టీ తరపున బూర్గంపాడు ఎమ్మెల్యేగా 1989, 1994 ఎన్నికల్లో పోటీచేసి గెలిచారు. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన ప్రజాభిమానం పొందారు.
నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషిచేశారు పదవీకాలం పూర్తయిన తర్వాత కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న కుంజా భిక్షం ఆ తర్వాత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఆవిర్భావ సమయంలో రెండేళ్ళపాటు పనిచేశారు. అనంతరం బీజేపీకి దగ్గరైనారు. ఆదివాసీ సమస్యల పట్ల పోరాడటంలో కుంజా భిక్షం తనదైన ముద్ర వేసుకున్నారు. మెదడు సంబంధిత వ్యాధితో ఆసుపత్రిలో నెలరోజుల క్రితం చేరిన ఆయన శనివారం రాత్రి బ్రెయిన్ స్ట్రోక్‌తో చనిపోయినట్లు బంధువుల ద్వారా తెలిసింది. కుంజా భిక్షం మృతిపట్ల సీఎం కెసీఆర్ సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.