- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైస్ మిల్లర్ల కొమ్ముకాస్తోన్న టీఆర్ఎస్ ప్రభుత్వం : శ్రీధర్ బాబు
దిశ, కాటారం: వరిధాన్యం కొనుగోలు చేయకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పట్ల కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మంథని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ఖరీఫ్, రబీ సీజన్లలో కొనుగోలు చేసిన ధాన్యంపై తరుగు పేరిట క్వింటాలుకు 5 నుండి 10 కిలోలు కట్ చేసి రైతులను ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. రైతులు ధాన్యం అమ్ముకోవడానికి పూర్తిగా రైస్ మిల్లర్ల మీద ఆధార పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం మూలంగా మార్కె్ట్‌కు తీసుకొచ్చిన ధాన్యం ఎండకు ఎండి, వానకు తడిసి మొలకెత్తుతోందని అన్నారు. ఇకనైనా ఆలస్యం చేయకుండా వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజబాబు, మండల పరిషత్ అధ్యక్షుడు సమ్మయ్య పాల్గొన్నారు.