మాజీ మంత్రి ప్రత్తిపాటికి తప్పిన ప్రమాదం

by srinivas |
మాజీ మంత్రి ప్రత్తిపాటికి తప్పిన ప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావుకు ప్రమాదం తప్పింది. ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నరసరావుపేట- చిలకలూరిపేట మార్గంలో ప్రయాణిస్తున్న ఆయన కారును మరో కారు ఢీకొట్టింది. దీంతో ఆయన కారు స్వల్పంగా దెబ్బతింది. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పుల్లారావు వెల్లడించారు. హైదరాబాద్‌ నుంచి చిలకలూరిపేటకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story