- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘చంద్రబాబును శాశ్వతంగా రాజకీయాల నుంచి తొలగించండి’
దిశ, ఏపీబ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును రాజకీయాల నుంచి శాశ్వతంగా తొలగించాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే ఆనం రాం నారాయణరెడ్డి డిమాండ్ చేశారు. సీఎం వైఎస్ జగన్‌పై ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు దుర్భాషలాడించారని ఆనం ఆరోపించారు. ప్రజల సంతకాలతో సేకరించిన లేఖను గవర్నర్‌కు పంపేందుకు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుకు ఎమ్మెల్యే సోమవారం అందజేశారు. అనంతరం ఆనం రాంనారాయణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ సభ్య సమాజం చంద్రబాబు వైఖరిని తప్పు పడుతోందన్నారు. రాజకీయ మనుగడ కోసం దిగజారి వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. ప్రజాతీర్పుని గౌరవించకుండా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. జనాగ్రహ దీక్షలో టీడీపీ తీరుకి నిరసనగా గవర్నర్ లేఖ కోసం సంతకాలు సేకరించినట్లు మాజీమంత్రి ఆనం వెల్లడించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇతర పొలిట్ బ్యూరో సభ్యులు రెచ్చగొట్టే వ్యాఖ్యలతో సమాజంలో అశాంతిని రేకెత్తించి.. రాజకీయ లబ్ది పొందాలని దుశ్చర్యలకు పాల్పడుతున్నారని.. వారిపై చట్టరిత్యా కఠిన చర్యలు తీసుకోవాలని మాజీమంత్రి ఆనం రాంనారాయణరెడ్డి డిమాండ్ చేశారు.