మనీలాండరింగ్‌ కేసులో మాజీ హోం మంత్రికి నోటీసులు

by Shamantha N |   ( Updated:2021-07-03 05:51:28.0  )
anil deshmukh news
X

న్యూఢిల్లీ: మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తాజాగా మరోసారి సమన్లు పంపింది. మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించి ఈ నెల 5న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. ఈడీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన స్టేట్‌మెంట్‌ను అధికారులు రికార్డు చేయనున్నారు. ఇది ఆయనకు మూడో నోటీసు కావడం గమనార్హం. రూ. 100 కోట్ల లంచం, దోపిడీ ఆరోపణలకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఆయనకు ఈడీ ఈ సమన్లను జారీ చేసింది.

కాగా ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో పోలీసు అధికారి సచిన్ వాజే అరెస్టై, సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇదే సమయంలో బార్లు, పబ్‌ల నుంచి ప్రతినెలా 100 కోట్లు వసూలు చేయాలని సచిన్ వాజేకు అప్పటి హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ చెప్పారని మరో పోలీసు అధికారి పరంవీర్ ఆరోపణలు చేశారు. దీంతో పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఈ ఆరోపణల నేపథ్యంలో అనిల్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed