జేసీ బ్రదర్స్‌కు ఇక జజ్జనకరే !

by srinivas |
జేసీ బ్రదర్స్‌కు ఇక జజ్జనకరే !
X

జేసీ బ్రదర్స్ అధికారంలో ఉన్నప్పుడు కాంట్రాక్టు, వ్యాపారాలతో అనంతపురంతో పాటు ఏపీలో కూడా చక్రం తిప్పారు. కాంగ్రెస్, టీడీపీల్లో ఉన్నప్పుడు అటు సీఎంలను జిల్లాలో అధికారులను మచ్చిక చేసుకొని వ్యాపారాలను మూడు పువ్వులు ఆరు కాయలుగా చేసుకున్న లీడర్స్. దివాకర్ ట్రావెల్స్, సిమెంట్ ఫ్యాక్టరీలే కాకుండా మరికొన్ని వ్యాపార సామ్రాజ్యాలను స్థాపించుకొని పాలిటిక్స్, పవర్‌లో వెనక్కి చూసుకోకుండా మాటలగారడి చేసిన పొలిటిషియన్స్. 2014 వరకు కాంగ్రెస్‌, 2019 వరకు టీడీపీలో అధికారం ఉన్న టైంలో హీరోలుగా వెలిగారు. కానీ మొన్న జరిగిన ఎలక్షన్స్‌‌లో జగన్ ప్రభంజనంలో జేసీ ఓడిపోవడంతో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది.

చంద్రబాబు హయాంలో ఎంపీగా పనిచేసిన జేసీ దివాకర్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న జగన్‌పై ఓ రేంజ్‌లో తిట్లదండకం అందుకున్నాడు. రాజకీయ ఆరోపణలే కాకుండా చంద్రబాబుతో బహిరంగ సభల్లో వేదిక పంచుకున్న ప్రతిసారి జగన్‌ను వ్యక్తిగతంగా దూషిస్తూ వచ్చాడు. ఈ కామెంట్లను జగన్‌ సీఎం అయ్యాక కూడా కొనసాగించడంతో వైసీపీ ప్రభుత్వానికి టీడీపీలో జేసీ ఫస్ట్ టార్గెట్ అయిపోయాడు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను వ్యతిరేకించడంతో పాటు చంద్రబాబును ఆకాశానికి ఎత్తేలా మాట్లాడటం మొదలు పెట్టాడు. ఈక్రమంలోనే అధికారం చేపట్టిన తొలిరోజు నుంచే అవినీతిపై ఒంటికాలిపై లేస్తూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తనపై వ్యతిగతంగా నిరాధారమైన వ్యాఖ్యాలు చేస్తూ వచ్చినవారిని ఓ కంట కనిపెడుతున్న జగన్‌కు జేసీ దివాకర్ రెడ్డి దొరకాల్సిన చోట దొరికిపోయాడు.

నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కొన్ని దివాకర్ ట్రావెల్స్‌ బస్సులతో పాటు, త్రిశూల్ కంపెనీ విషయంలో షాకిచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడతో జేసీ బ్రదర్స్‌కు పెద్ద దెబ్బ పడింది. వీటన్నింటికి తోడు తాడిపత్రి ఎస్సై సంతకాలను ఫోర్జరీ చేసినట్లు పోలీసులు గుర్తించడంతో రాష్ట్రవ్యాప్తంగా జేసీ బ్రదర్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. వన్ బై వన్ ఒక్కో అవినీతి బయట పడుతుండటంతో జేసీ బ్రదర్స్‌కు ఇక గడ్డుకాలమే మిగిలిందని పలువురు రాజకీయ నేతలు అభిప్రాయ పడుతున్నారు. సభలు, సమావేశాల్లో నీతులు చెప్పుకుంటూ చ్చిన జేసీ బ్రదర్స్ వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయట పడుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది. గతంలో తనపై మాట్లాడిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని జేసీపై జగన్‌ ఏవిధంగా ఫైనలైజ్ చేస్తాడన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisement

Next Story