పంజాబ్ మాడల్‌ను అనుసరించండి: ప్రధాని

by Shamantha N |
పంజాబ్ మాడల్‌ను అనుసరించండి: ప్రధాని
X

న్యూఢిల్లీ: సీఎంలతో వర్చువల్ కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రధాని మోడీప్రధాని మోడీ, కరోనా కట్టడికి పంజాబ్ అనుసరిస్తున్న మాడల్‌ను మిగితా రాష్ట్రాలు అనుసరించాలని సూచించారు. కరోనా కట్టడిలో పంజాబ్ విజయవంతంగా ముందుకు సాగుతున్నది. మైక్రో కంటైన్‌మెంట్, ఇంటింటి నిఘా వ్యూహాన్ని అమలు చేస్తున్నది. కేసులు వెలుగుచూసిన ప్రాంతాలను తక్కువ పరిధినే మూసేస్తున్నది. అలాగే, ఇంటింటి నిఘాతో ఇది వరకే ఇతర దీర్ఘకాలిక వ్యాధులు కలిగి ఉన్నవారిని ముందుగానే గుర్తించి కరోనా కబళించకుండా కాపాడుకునే వ్యూహాన్ని పంజాబ్ ప్రభుత్వం అనుసరిస్తు్న్నది. ఈ వ్యూహాన్నే ఇతర రాష్ట్రాలూ అనుసరించాలని ముఖ్యమంత్రులకు ప్రధాని మోడీ సూచించారు.

Advertisement

Next Story