వచ్చే ఏడాదిలోనే బ్రిటన్‌‌కు విమానాలు !

by Shamantha N |
వచ్చే ఏడాదిలోనే బ్రిటన్‌‌కు విమానాలు !
X

దిశ, వెబ్‌డెస్క్: బ్రిటన్ నుంచి విమానాల రాకపోకలపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. కొత్త స్ట్రెయిన్ వైరస్ దృష్ట్యా విమానాల రాకపోకలపై నిషేధం విస్తున్నట్లు బుధవారం తెలిపింది. వచ్చేనెల 7వరకు విమానాల రాకపోకలపై నిషేధం కొనసాగుతుందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పురి తెలిపారు. ఆ తర్వాత కూడా కఠిన ఆంక్షలతోనే విమానాల సేవల పునరుద్ధరణ ఉంటుందని, త్వరలోవివరాలు వెల్లడిస్తామని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కొత్తరకం వైరస్ కలకలం నేపథ్యంలో భారత్, బ్రిటన్ మధ్య ఈనెల 23 నుంచి 31వరకు విమాన సేవలను తాత్కాలికంగా రద్దు చేయగా, ఇప్పుడు జనవరి 7వరకు కొనసాగించారు.

Advertisement

Next Story