సబ్ రిజిస్ట్రార్ల వరుస సస్పెన్షన్లు.. నకిలీ చలాన్ల స్కాం విలువ @10కోట్లు

by srinivas |
registrar-scam
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో నకిలీ చలాన్ల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అక్రమాల విలువ సుమారు రూ.10కోట్లు ఉంటుందని అధికారులు ఓ అంచనాకు వచ్చారు. గతేడాది నుంచి జరిగిన రిజిస్ట్రేషన్ లావాదేవీలను పరిశీలించిన అధికారులు రూ.5.5 కోట్ల మేర అక్రమాలు జరిగినట్టు గుర్తించారు. గతేడాది నుంచి ఇప్పటివరకు జరిగిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో జరిగిన కుంభకోణం విలువ రూ.10 కోట్లు ఉంటుందని నిర్దారణకు వచ్చారు. కాగా, ఈ వ్యవహారంలో భాగం పంచుకున్న ఐదుగురు సబ్ రిజిస్ట్రార్లు ఇప్పటికే సస్పెన్షన్‌కు గురయ్యారు. మరికొందరికి అధికారులకు నోటిసులు ఇచ్చారు. నకిలీ చలాన్ల స్కాం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించగా విజిలెన్స్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో సంబంధం ఉన్నవారి పేర్లను ఒక్కొక్కరిగా లిస్టు తీసి చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed