పాకిస్థాన్‌లో కాల్పులు.. ఐదుగురు పోలీసులు మృతి

by vinod kumar |
పాకిస్థాన్‌లో కాల్పులు.. ఐదుగురు పోలీసులు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: భారత్, చైనా సరిహద్దుల వద్ద నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు ఇంకా చల్లారకముందే, మరోవైపు పాకిస్థాన్ దుండగులు మరోసారి రెచ్చిపోయారు. సోమవారం అర్ధరాత్రి పాకిస్థాన్‌లో దుండగులు జరిపిన కాల్సుల్లో ఐదుగురు పోలీసులు మృతిచెందారు. ఈ ఘటన పీఓకే ప్రాంతం గిల్గిత్‌ బాల్టిస్థాన్‌లో చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో ఐదుగురు పోలీసులు మృతిచెందగా, మరో పోలీసు గాయపడ్డట్టు ఓ న్యూస్ ఛానల్ తెలిపింది. ఆ ప్రాంతంలో దుండగులు ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకునేందుకు వెళ్లగా వారు పోలీసులపై కాల్పులు జరిపారు. అయితే ఈ కాల్పులు జరిపింది. ఉగ్రవాదులు కాదని, మారణాయుధాలు సరఫరా చేసే ముఠా అని స్థానిక మంత్రి మిర్‌ అఫ్జల్‌ ఖాన్‌ వెల్లడించారు.

Advertisement

Next Story