what your sleep animal is :మీ నిద్ర ఏ జంతువును పోలి ఉందో తెలిపే.. ఫిట్‌బిట్ న్యూ ఫీచర్

by Shyam |   ( Updated:2021-05-29 04:22:57.0  )
Fitbit
X

దిశ, ఫీచర్స్: ‘గురక’ ( snores) చాలామందిని వేధించే సమస్య. ముఖ్యంగా గురకపెట్టే వాళ్లకంటే వాళ్ల పక్కనున్నవారే దానివల్ల ఇబ్బంది పడుతుంటారు. అయితే ‘గురక’పై ఫిట్‌బిట్ (Fitbit) ఓ ఫీచర్ తీసుకువచ్చింది. ఈ ఫీచర్ గురక శబ్ధాన్ని గుర్తించడంతో పాటు, దాని తీవ్రత ఎంత? మీ నిద్ర అలవాట్లు ఏ జంతువుకు దగ్గరగా ఉన్నాయి? అనే విషయాన్ని ఇది తెలియజేస్తుంది.

ఫిట్‌బిట్ యాప్ లేటెస్ట్ అప్‌డేట్‌లో ‘నైట్‌టైమ్ స్నోరింగ్’ ఫీచర్ అందిస్తోంది. ఇది మన ‘స్లీప్ సైకిల్’ ట్రాకింగ్ వ్యవస్థను మానిటర్ చేయబోతుంది. హార్ట్‌బీట్ రేట్ (Heart Beat ), మూవ్‌మెంట్ ఆధారంగా ఏ స్లీప్ సైకిల్‌లో మనం ఎంతసమయం నిద్రించామో ఇది గుర్తిస్తుంది. అంతేకాదు యాప్‌లో ‘స్నోర్ అండ్ నాయిస్ డిటెక్ట్’ ఫీచర్ ఆన్ చేస్తే, ఫిట్‌బిట్‌లో మైక్రోఫోన్‌ ఆన్ అవుతుంది. ఇది గురకతో సహా పరిసర శబ్దాలను వింటుంది. ఈ క్రమంలోనే మీ నుండి లేదా మీ పక్కన ఉన్నవారి నుంచి వచ్చే శబ్దాలను, గురకను రాత్రిపూట ఇది పర్యవేక్షించగలదు. ఇందులో ధ్వని తీవ్రత ఆధారంగా బేస్ లైన్ శబ్దస్థాయిని నిర్ణయించగా.. ఈ అల్గారిథం బేస్‌లైన్ శబ్దస్థాయి కంటే బిగ్గరగా ఉన్న గురకను రికార్డ్ చేస్తుంది. ఒకవేళ గదిలో గురక కంటే బిగ్గరైన శబ్దాలు ఉంటే గురకను ఇది గుర్తించలేకపోతుంది. రాత్రి ఎంత సమయం పాటు గురకలో గడిపామో సూచించడానికి ఫిట్‌బిట్ శాతాల్లో ఫలితాలను చూపిస్తుంది.

* తేలికపాటిది ఏదీ లేదు (None to Mild)): అంటే మీరు నిద్రలో 10% కన్నా తక్కువ సమయం గురక పెట్టారు.
* మితమైన (Moderate ): మీరు పడుకున్నప్పుడు 10-40% సమయం గురక పెట్టారు.
* తరచుగా(Frequent): మీరు నిద్రలో 40% కంటే ఎక్కువ సమయం గురకపెట్టారు.

అంతేకాదు గదిలోని పరిసర శబ్దాలు ఎంత వరకు ఎంత పెద్ద శబ్దంతో ఉందో ఫిట్‌బిట్ చెప్పగలదు.
* చాలా నిశ్శబ్దంగా (వెరీ క్వైట్) :30 db లేదా అంతకంటే తక్కువ
* నిశ్శబ్దం (క్వైట్) :30 db-50 db
* మోడరేట్ :50–70 db
* లౌడ్ :70-90 db
* చాలా బిగ్గరగా :90 db లేదా అంతకంటే ఎక్కువ

what your sleep animal is

ఫిట్‌బిట్ ‘యువర్ స్లీప్ యానిమల్” అనే మరో స్లీప్ ఫీచర్‌పై పనిచేస్తోంది. ప్రస్తుతం ఇది అభివృద్ధి ప్రారంభ దశలో ఉన్నట్లు కనిపిస్తోంది. యాప్‌లో ప్రస్తుతం కొన్ని స్లీపింగ్ ప్రొఫైల్స్ ఉన్నాయి. వీటిలో వివరణలతో పాటు, అందమైన జంతు పోలికలు ఉన్నాయి. ఉదాహరణకు: రెస్ట్‌లెస్ స్లీపర్ – ఎలుగుబంటి. సెగ్మెంటెడ్ స్లీపర్ – డాల్ఫిన్. నిస్సార స్లీపర్ – జిరాఫీ. షార్ట్ స్లీపర్ – హమ్మింగ్‌బర్డ్. స్లో టు ఫాల్ స్లీప్ స్లీపర్ – కంగారూ. సాలిడ్ స్లీపర్ – తాబేలు.

Advertisement

Next Story

Most Viewed