మంజీరా నదిలో చిక్కుకున్న మత్స్యకారులు

by Shyam |
మంజీరా నదిలో చిక్కుకున్న మత్స్యకారులు
X

దిశ, మెదక్: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సింగూర్ నుంచి పెద్ద ఎత్తున వస్తున్న నీటి ప్రవాహంతో మంజీరా నది ఉదృతంగా ప్రవహిస్తోంది. మంగళవారం నాడు మంజీరా నదికి కాస్త తగ్గిన వరద.. బుధవారం ఉదయానికి మళ్లీ ఉధృతి పెరిగింది. అయితే వరద తగ్గడంతో నలుగురు మత్స్యకారులు కొల్చారం మండల పరిధిలోని హనుమాన్ బండల్లోకి చేపల వేటకు వెళ్లారు. ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగడంతో మత్స్యకారులు అక్కడే చిక్కుకుని సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. అవసరం అయితే ఆర్మీ రెస్క్యూ టీం సహాయం తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Advertisement

Next Story