దేశవ్యాప్తంగా మిలిటరీ బ్యాండ్ ప్రదర్శనలు

by Shamantha N |   ( Updated:2020-08-05 10:46:46.0  )
దేశవ్యాప్తంగా మిలిటరీ బ్యాండ్ ప్రదర్శనలు
X

న్యూఢిల్లీ: తొలిసారిగా భారత ఆర్మీ, నేవీ, పోలీసు బలగాలు పంద్రాగస్టును పురస్కరించుకుని పక్షం రోజులపాటు మిలిటరీ బ్యాండ్ ప్రదర్శనలు ఇవ్వనుంది. ఈ సారి కరోనా వారియర్స్‌కు సంఘీభావంగా ఈ ప్రదర్శనలు చేపట్టాలని కేంద్ర రక్షణ మంత్రి ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 1 నుంచి 15 వరకు దేశంలోని వివిధ నగరాల్లో భిన్న తేదీల్లో ప్రదర్శన ఇవ్వాలని ఆదేశించింది.

ఇప్పటికే పోరుబందర్, హైదరాబాద్, బెంగళూర్, రాయ్‌పూర్, అమృత్‌సర్, గువహతి, అలహాబాద్, కోల్‌కతాలలో మిలిటరీ బ్యాండ్ పర్ఫార్మెన్స్‌లు ముగిశాయి. బుధవారం విశాఖపట్నం, నాగపూర్, గ్వాలియర్‌లలో ముగియగా, రేపు శ్రీనగర్, కోల్‌కతాల్లో జరగనున్నాయి. ఈ సారి కరోనా కారణంగా ఈ సారి ఎర్రకోట దగ్గర లైవ్‌గా మిలిటరీ బ్యాండ్ ప్రదర్శనలు ఉండవని తెలిపింది. అయితే, అంతకుముందే చేసిన ప్రదర్శనల వీడియోలు ప్రసారంకానున్నాయి. అంతేకాదు, రాష్ట్రాలూ వెబ్‌క్యాస్టింగ్ ద్వారానే ఈ వేడుక నిర్వహించుకోవాలని సూచించింది.

Advertisement

Next Story

Most Viewed