- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐఎస్ఎస్ కోసం రిఫ్రిజిరేటర్
దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండే వ్యోమగాములు ఏం తింటారు? వారి ఆహారంలో ఎక్కువ ఫ్రోజ్ చేసి ఉన్న ఆహారాన్ని, వారు రీహైడ్రేట్ చేసుకుని తింటారు. ఒక్కసారి ఫ్రోజ్ చేసిన ప్యాక్ నుంచి ఆహారం తీసిన తర్వాత దాన్ని పూర్తిగా తినేయాలి. లేదంటే అది మళ్లీ తినడానికి వీలు ఉండదు. కానీ, ఇక ఆ సమస్య ఉండదు ఎందుకంటే యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో, బోల్డర్ పరిశోధకులు అంతరిక్షంలో పనిచేసే రిఫ్రిజిరేటర్‌ను తయారుచేశారు. దాని పేరు ఫ్రీజర్ రిఫ్రిజిరేటర్ ఇంక్యుబేటర్ డివైజ్ ఫర్ గ్యాలరీ అండ్ ఎక్స్‌పెరిమెంటేషన్. యూసీబీ వద్ద ఉన్న బయోసర్వ్ స్పేస్ టెక్నాలజీస్ వారు దీన్ని పూర్తిస్థాయిలో ప్రామాణిక మైక్రోవేవ్ సైజులో ఉండేలా రూపొందించారు.
ఇందులో రొటేట్ అయ్యే విడిభాగాలు లేనందున అంతరిక్షంలో ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటుందని దీని తయారీ ప్రాజెక్టులో పనిచేసిన రాబీ ఆరన్ అంటున్నారు. భూమ్మీద ఉపయోగించే సాధారణ ఫ్రిడ్జికి వెనకవైపు నుండి వేడి విడుదలవుతుంది. అంతరిక్షంలో అలా వేడి విడుదల అయితే, చాలా ప్రమాదాలు సంభవిస్తాయి. కాబట్టి దీన్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వాటర్-కూలింగ్ వ్యవస్థకు అనుసంధానించుకునేలా రూపొందించినట్లు ఆయన చెప్పారు. మొత్తం ఎనిమిది యూనిట్‌లను నాసా తీసుకుని, వాటిలో రెండింటిని సైగ్నస్ ఎన్‌బీ 14 రోబోటిక్ రీసప్లయ్ క్రాఫ్ట్ ద్వారా ఐఎస్ఎస్‌కు పంపించబోతోంది. ఇందులో భూమ్మీది నుంచి పంపిన ఆహారాన్ని, అక్కడే హైడ్రోఫోనిక్ విధానంలో పండించిన ఆహారంతో పాటు మెడిసిన్‌ను కూడా నిల్వచేసుకోవచ్చు.