పాఠశాలలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న విద్యార్థులు

by Shamantha N |   ( Updated:2021-04-09 03:14:01.0  )
పాఠశాలలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న విద్యార్థులు
X

దిశ, వెబ్ డెస్క్: గుజరాత్ అహ్మదాబాద్ కృష్ణనగర్‌లోని అంకూర్‌ పాఠశాలలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా స్కూల్లో మంటలు వ్యాపించడంతో భారీగా పొగ కమ్ముకుంది. ప్రమాదం జరిగిన సమయంలో విద్యార్థులు పాఠశాలలో ఉండగా.. వారిలో ఐదుగురు మంటల్లో చిక్కుకున్నారు. వారిని స్థానికులు రక్షించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని 5 ఫైరింజన్లతో మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో ఎవరికి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూట్ కావడం వలనే మంటలు వ్యాపించాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే గుజరాత్ లో కరోనా కారణంగా పాఠశాలలు మూసి ఉండగా పిల్లలు పాఠశాలకు ఎందుకు వచ్చారు అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .

Advertisement

Next Story