- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థికసహయం..
దిశ,దుమ్ముగూడెం: దుమ్ముగూడెం మండల పరిధిలోని అనారోగ్యంతో , ప్రమాదాలకు గురై ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వ్యక్తులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆదివారం తెరాస రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తెల్లం వెంకట్రావు, మండల అధ్యక్షులు సత్యనారాయణ లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. దుమ్ముగూడెం మండలానికి చెందిన టిఆర్ఎస్ మండల అధికార ప్రతినిధి ఎండి జానీ పాషాకి లక్ష రూపాయలు, ప్రమాదంలో నడుము విరిగి పూర్తిగా మంచానికే పరిమితమైన చిన్ననల్లబల్లి గ్రామానికి చెందిన పూసం సత్తిబాబుకు 2.25 లక్షలు, ఆర్లగూడెం గ్రామానికి చెందిన పి.చిన్నారావుకు 33 వేల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎమ్మెల్సీ బాలసాని, లక్ష్మీనారాయణ గారి సిఫారసుతో మంజూరు కాగా వాటిని లబ్డిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ.. అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు గురయ్యే ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి సహాయనిది ద్వారా సహాయం అందుతుందని, అర్హులైన వారు సహాయాన్ని పొందాలని కోరారు. ఇబ్బందులతో ఉన్న మాకు ఆర్థిక చేయూత నిచ్చిన ముఖ్యమంత్రికి, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ కి, తెల్ల.వెంకట్రావుకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షలు అన్నె.సత్యనారాయణ మూర్తి, ప్రధాన కార్యదర్శి కణితి రాముడు, ఉపాధ్యక్షుడు తునికి కామేశ్, కోశాధికారి దామెర్ల శ్రీనివాస్, అధ్యక్షుడు మోత్కురి శ్రీకాంత్, మద్దుకూరి వేణు తదితరులు పాల్గొన్నారు.