నేలకొండపల్లిలో సినిమా షూటింగ్

by Anukaran |
నేలకొండపల్లిలో సినిమా షూటింగ్
X

దిశ, పాలేరు: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ‘లాస్ట్ వికెట్’ అనే చిత్రానికి షూటింగ్ నిర్వహిస్తున్నారు. జానకి రాజు, స్వక్త్ ప్రియా,ప్రసాద్, భాను,మైసా శ్రీను, పి.వి.నాగిరెడ్డి ప్రధాన తారాగణంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. శేషు మనీ, రామారావు మాతుమూరు, వెంకట్ రంగరాజు నిర్మాతగా, డైరెక్టర్ దక్షిన్ ఓషో, కెమెరామెన్ గా ఎస్. రాఘవేంద్ర ప్రసాద్ సారథ్యం వహిస్తున్నారు. ఈ సినిమాలో నూతన నటీనటులకు అవకాశం కల్పించారు. డైరెక్టర్ దక్షిన్ ఇందుకు సంబంధించి జూలై 13న ఆడిషన్స్ లో ఆర్టిస్టులకు అవకాశం కల్పించారు.

Advertisement

Next Story