ఎస్ఐతో మహిళా ఎస్ఐ ప్రేమాయణం.. వేరే అమ్మాయితో పెళ్లి

by srinivas |
ఎస్ఐతో మహిళా ఎస్ఐ ప్రేమాయణం.. వేరే అమ్మాయితో పెళ్లి
X

దిశ, ఏపీ బ్యూరో: విజయవాడలో ఓ మహిళా ఎస్ఐ ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేపుతోంది. శనివారం రాత్రి అయోధ్యనగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే సకాలంలో పోలీసులు ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాపాయం నుంచి బైటపడింది. ఆత్మహత్యకు ప్రయత్నించడం వెనుక సీసీఎస్‌లో పనిచేస్తున్న ఓ ఎస్ఐతో ప్రేమ వ్యవహారమే కారణమన్నట్లుగా తెలుస్తోంది. బాధిత మహిళా ఎస్ఐ, సీసీఎస్‌లో పనిచేస్తున్న ఎస్ఐ ఇద్దరూ ఇష్టపడ్డారు. అయితే సదరు ఎస్ఐ తన దగ్గర బంధువుని వివాహం చేసుకున్నాడు. ఎస్ఐ భార్యకు వీరి ప్రేమ వ్యవహారం తెలిసింది. దీంతో ఆమె మహిళా ఎస్ఐకు వార్నింగ్ ఇవ్వడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించినట్లుగా తెలుస్తోంది.

మహిళ ఎస్ఐ ఆత్మహత్యాయత్నం సమాచారం తెలిసిన వెంటనే సీసీఎస్‌లోని ఎస్ఐ ఆమె ఇంటికి వెళ్లినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. మహిళా ఎస్ఐ, సీసీఎస్‌లోని ఎస్ఐ ప్రేమ వ్యవహారంపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. వారిద్దరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మహిళా ఎస్ఐ ఆత్మహత్యాయత్నానికి సంబంధించి అజిత్‌సింగ్ నగర్ పీఎస్‌లో కేసు నమోదు అయ్యింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

Next Story