- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నీపై కేసు పెడుతా.. సర్పంచ్‌కి మహిళా డాక్టర్ హెచ్చరిక
దిశ, మునుగోడు: విద్యావంతురాలైన ఓ మహిళ కేసు పెడతానంటూ తమ గ్రామ సర్పంచ్ ను హెచ్చరించింది. వివరాలలోకి వెళితే నల్లగొండ జిల్లా మునుగోడు గ్రామపంచాయతీ పరిధిలోని కమ్మగూడంలో ఇటీవల కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. అయితే పాజిటివ్ వచ్చిన వ్యక్తితో కాంటాక్ట్ లో ఉన్నవారిని గుర్తించి వారిని క్వారంటైన్ లో ఎందుకు ఉంచలేదంటూ కమ్మగూడంకి చెందిన మహిళ స్థానిక సర్పంచ్ కు ఫోన్ చేసి అడిగింది. ఈ సందర్బంగా సదరు మహిళ మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా తను డాక్టర్ ని అని, కరోనా వైరస్ ఎంత ప్రమాదకరమో తనకు తెలుసు అని, వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎందుకు తీసుకోవడం లేదని అడిగింది. దీంతో సర్పంచ్ స్పందిస్తూ.. అధికారుల దృష్టికి తీసుకెళ్లానని కాంటాక్ట్ లను గుర్తించి క్వారంటైన్ చేస్తామని, అధికారులు కూడ ఆఫీస్ నుండి బయటకు రావడం లేదని అన్నారు. సదరు మహిళ మాట్లాడుతూ.. జరగాల్సిన నష్టం జరిగాక క్వారంటైన్ చేస్తే ఏం లాభం అని, 12 గంటలలోపు చర్యలు తీసుకోకపోతే సర్పంచ్ మీద కేసు పెడతానని హెచ్చరించింది. దీనికి సంబందించిన ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.