పప్పా.. పప్పా కొట్టొద్దు పప్పా అన్నా.. కనికరం చూపని కసాయి తండ్రి

by Anukaran |   ( Updated:2021-11-27 11:12:43.0  )
father-beats
X

దిశ, చార్మినార్: పప్పా.. పప్పా కొట్టొద్దు పప్పా … అంటూ ఓ పసి బాలుడు బ్రతిమిలాడుతూ మంచం కిందికి వెళ్లి దాచుకున్నా … తలగడ అడ్డం పెట్టుకున్నా … కూతురు వద్దు పప్పా అని ప్రాధేయపడుతున్నా… ఆ కర్కోటక కన్న తండ్రికి హృదయం చలించలేదు. రెండున్నర నిమిషాలు ఆగకుండా చేతిలోని కట్టె విరిగేలా ఒళ్లంతా హూనం చేసిన హృదయవిధారక ఘటన పాతబస్తీ ఛత్రినాక పోలీస్​స్టేషన్​పరిధిలో చోటు చేసుకుంది. ఛత్రినాక ఇన్​స్పెక్టర్​సయ్యద్​ అబ్దుల్ ఖాదర్​జిలానీ తెలిపిన వివరాల ప్రకారం … గౌలిపురాకు చెందిన జి. అశోక్​కు ఇద్దరు సంతానం. ఒక కుమారుడు (8), కుమార్తె. అశోక్​త్రూప్​ బజార్​లో ఎలక్ట్రికల్ షాపులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో కొడుకు బాగా అల్లరి చేస్తున్నాడని అప్పుడే ఇంటికి వచ్చిన భర్త అశోక్​కు భార్య చెప్పింది. తాగిన మత్తులో ఉన్న అశోక్​కన్న కొడుకుపై వీరంగం సృష్టించాడు. కట్టెతో ఇష్టం వచ్చినట్టు 2.30 నిమిషాలపాటు చితకబాదాడు. ఇదంతా కూతురు సెల్​ఫోన్​లో రికార్డు చేస్తూనే కొట్టొద్దు పప్పా అంటూ బ్రతిమిలాడింది. బాలుడి ఒళ్లంతా హూనం కావడంతో తల్లి ఛత్రినాక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసకున్న పోలీసులు తండ్రి అశోక్​ను అదుపులోకి తీసుకున్నారు. తీవ్ర గాయాలపాలైన బాలుడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Next Story