సీడ్ కంపెనీ ప్రతినిధులను బంధించిన రైతులు

by Sridhar Babu |
సీడ్ కంపెనీ ప్రతినిధులను బంధించిన రైతులు
X

దిశ , సుల్తానాబాద్: పెద్దపల్లి మండలం కొత్తపల్లిలో వరుణ్ అగ్రిటెక్ సీడ్ కంపెనీ ప్రతినిధిని గ్రామ రైతు వేదిక భవనంలో రైతులు నిర్బంధించారు. వరుణ్ అగ్రిటెక్ సీడ్ కంపెనీకి చెందిన NLR145 వరి వంగడాన్ని 70 ఎకరాల్లో వేసి తీవ్రంగా నష్టపోయామని, నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ కంపెనీ ప్రతినిధిని రైతులు బంధించారు. కొంతవరకు వరి ధాన్యం వచ్చినప్పటికీ, చీడపీడలను ఎదుర్కోవడంలో ఈ వంగడం పూర్తిగా విఫలమైందని అన్నారు. సర్పంచ్ జోక్యం చేసుకొని కంపెనీ ప్రతినిధులతో మాట్లాడడంతో నష్టపరిహారం చెల్లిస్తామని కంపెనీ ఒప్పుకోవడంతో ప్రతినిధులను విడుదల చేశారు.

ఈ పంటకు సంబంధించి గతంలో కంపెనీకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఈ రోజు గ్రామానికి వచ్చిన కంపెనీ ప్రతినిధిని క్షేత్రస్థాయిలో పరిశీలించి కంపెనీకి నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.

Advertisement

Next Story