- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నేడు రైతుల 'చక్కా జామ్'..
దిశ,వెబ్‌డెస్క్: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా.. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. నేడు దేశవ్యాప్తంగా చక్కా జామ్ పేరుతో మూడు గంటల పాటు రహదారుల దిగ్భంధానికి రైతులు సిద్ధమయ్యారు. చక్కా జామ్ పేరుతో మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు జాతీయ, రాష్ట్ర రహదారులను దిగ్భంధనం చేయనున్నారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో మెమోరాండం సమర్పించున్నారు.
చక్కా జామ్ పేరుతో రైతుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. సింఘు, టిక్రి, ఘాజీపూర్‌లో భారీగా అదనపు బలగాలు మోహరించాయి. ఎర్రకోట వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఢిల్లీ సరిహద్దుల్లో ముళ్లకంచెలు, మేకులు, బారికేడ్లు, ఇనుపకంచెలు ఏర్పాటు చేశారు. ఇక ఢిల్లీ వీధుల్లో 50 వేల మంది పోలీసులు, అదనపు పారా మిలిటరీ బలగాలు మోహరించాయి. ఎర్రకోట తరహా ఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
దేశవ్యాప్తంగా చక్కా జామ్‌ను శాంతియుతంగా నిర్వహిస్తామని రైతు సంఘాల నేతలు ప్రకటించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు రహదారులు దిగ్భంధనం చేయనున్నారు. కార్యక్రమం అనంతరం నిమిషం పాటు హారన్ మోగించాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. రైతులు చేపట్టనున్న చక్కా జామ్‌కు విపక్షాలు మద్ధతిచ్చాయి. నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.