- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గన్ని బ్యాగుల కోసం రైతులు ధర్నా
దిశ, జడ్చర్ల: పంట పండించడం ఒక ఎత్తయితే పండిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి గన్ని బ్యాగులు లేక చివరికి రోడ్డెక్కాల్సిన పరిస్థితి నెలకొంది అన్నదాతలది. బుధవారంమిడ్జిల్ మండలం రాణి పేటలో తమకు ప్రభుత్వం గన్ని బ్యాగులు సరఫరా చేయాలంటూ చిల్వేర్,రనిపేట అన్నదాతలు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహిస్తూ ఆందోళనకు దిగారు. నెలరోజులుగా తమ ధాన్యం రక్షించుకోవడానికి టార్పాలిన్ కవర్లు ఇవ్వక పోవడమే గాక మరోవైపు అమ్ము కొందామంటే గన్ని బ్యాగులు కూడా ప్రభుత్వం సరఫరా చేయకపోవడంతో రోజుల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొందని, ఇప్పటికే అకాల వర్షంతో పలుమారు తమ ధాన్యం తడిసి పోయిందని తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
తమ ఇబ్బందులను అధిగమిస్తూ విషయాన్ని సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా.. ఫలితం లేకుండా పోతుందని కార్యాలయం చుట్టూ తిప్పుతూ మండలానికి వచ్చిన గాన్ని బ్యాగులను గుట్టుచప్పుడు కాకుండా పలుకుబడి ఉన్న నాయకులకు పంచుతున్నారని, రైతులు చివరికి న్యాయం కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నదాతలు వాపోయారు. వెంటనే ప్రభుత్వం స్పందించి తమకు గన్నీ బ్యాగులను సరఫరా చేస్తే వీలైనంత త్వరలో తమ ధాన్యాన్ని అమ్ము కొంటామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు ఆరబెట్టినా ధాన్యం అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కోనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రైతుల ధర్నా విషయం తెలుసుకున్న మండల పిఎసిఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తాసిల్దార్ శ్రీనివాసులు వ్యవసాయ అధికారి సిద్ధార్థ స్థానిక ఎస్సై జయ ప్రసాద్ రైతుల వద్దకు చేరుకొని గన్ని బ్యాగులు కొరత ఉన్న విషయం వాస్తవమేనని గన్ని బ్యాగులు బుధవారం సాయంత్రం వరకు రైతులకు అందిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు