యాసంగిలో వరి కొనుగోలు కేంద్రాలు ఉండవు: జిల్లా వ్యవసాయాధికారి..

by Shyam |
యాసంగిలో వరి కొనుగోలు కేంద్రాలు ఉండవు: జిల్లా వ్యవసాయాధికారి..
X

దిశ, అర్వపల్లి: రైతులు యాసంగి సాగులో ఆరుతడి పంటలనే వేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామారావు నాయక్ రైతులకు సూచించారు. శుక్రవారం జాజిరెడ్డిగూడెం గ్రామంలోని మార్కెట్ యార్డులో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. యాసంగిలో రైతులు వరి పంట వేయకుండా ఆరుతడి పంటలైన వేరుశనగ, పెసర, మంచి శనగలు, మినుములు, పొద్దుతిరుగుడు, కంది వంటి పంటలు వేసుకోవాలని రైతులకు సూచించారు. యాసంగిలో ఎఫ్.సి.ఐ ధాన్యం కొనుగోలు చేయడం లేదన్నారు.

యాసంగిలో వరి కొనుగోలు కేంద్రాలు ఉండవని స్పష్టం చేశారు. రైతులు వరి పంట కాకుండా ఆరుతడి పంటలు వేసుకొని వ్యవసాయ అధికారుల సూచనలు సలహాలు తీసుకుని అధిక దిగుబడులు సాధించాలని కోరారు. అవకాశమున్న రైతులు ఆయిల్ పామ్, కూరగాయలు సాగు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి రేఖల బాల దినకర్, ఏఈఓ శోభారాణి, ఆర్ ఎస్ ఎస్ గ్రామ కో-ఆర్డినేటర్ మామిడి సత్యనారాయణ, రైతులు శేఖర్, మల్లయ్య, సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story