- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కడుపు మండిన అన్నదాతలు..ఏం చేశారంటే
దిశ, ఆదిలాబాద్: ఆరుగాలం కష్టించి పండించిన పంటలు కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురిచేయడాన్ని నిర్మల్ జిల్లా రైతులు సహించలేకపోయారు. ఓ వైపు అకాల వర్షాలు చేతికొచ్చిన పంటను నాశనం చేస్తుండగా, మిగిలిన పంటను అమ్ముకుందామని వెళితే అధికారులు చేస్తున్న మోసానికి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం తమకు న్యాయం చేయాలని కోరుతూ కొనుగోలు కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. వారిని సముదాయించేందుకు వచ్చిన అదనపు కలెక్టర్‌ను నిలదీశారు. ఈ ఘటన నిర్మల్ జిల్లా కుంటాల మండలం అందుకూరు గ్రామంలో చోటు చేసుకుంది. రైతులు తీసుకొచ్చిన ధాన్యంలో ప్రతి 50 కిలోల బస్తాకు 3 నుంచి 4 కిలోలు తరుగు తీస్తున్నారని రైతులు అధికారుల తీరుపై మండిపడ్డారు. సమాచారం అందుకున్న జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అక్కడికి చేరుకుని వారిని సముదాయించే ప్రయత్నం చేయగా రైతులు కలెక్టర్‌ను చుట్టుముట్టారు. మాకు న్యాయం చేయకపోతే ఆందోళనకు దిగుతామని వారు చెప్పారు. దీంతో పోలీసులు రంగం ప్రవేశం చేసి రైతులను ముదాయించారు. ఇక మీదట రైతులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటానని అదనపు కలెక్టర్ భాస్కర రావు వారికి హామీ ఇచ్చారు.