- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సీతమ్మ ప్రాజెక్టు : మా భూములు లాక్కుని.. మమ్మల్నే బికారోల్లను చేసిండ్రు
దిశ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి గ్రామంలో నిర్మించనున్న సీతమ్మ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న భూ నిర్వాసితుల రిలే నిరాహారదీక్ష ఆదివారం 95వ రోజుకు చేరింది. అమ్మగారి పల్లి భూ నిర్వాసితులు విలేకరులతో మాట్లాడుతూ.. న్యాయం కోసం తాము 95 రోజుల నుంచి రిలే నిరాహారదీక్షలు చేస్తున్నా ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదని భూనిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కోరిక మేరకు సీతమ్మసాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు ఇచ్చాం..
కానీ, చివరికు మమ్మల్ని బికారోల్లను చేశారని కంటనీరు పెట్టుకున్నారు. భూ నిర్వాసితులమైన తమకు మా భూములు మాకు ఇవ్వకుండా, కనీసం పరిహారం కూడా ఇవ్వకుండా అరిగోస పెడుతున్నారని వాపోయారు. రైతులను రాజులుగా వర్ణించే టీఆర్ఎస్ ప్రభుత్వం తమను సీతమ్మ ప్రాజెక్టు భూ నిర్వాసితులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న వారికి నష్టపరిహారం లేదా ఎవరిభూములు వారికి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. నిరసన దీక్షలో దాసరి సత్యనారాయణ, దాసరి వెంకటేశ్వర్లు, దాసరి శ్రీనివాసరావు, నాగార్జున నరసింహాచారి, నేలపట్ల ఉదయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.