అన్నదాతల పోరాటం అభినందనీయం: రేవంత్ రెడ్డి

by Shyam |
అన్నదాతల పోరాటం అభినందనీయం: రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: నిద్రాహారాలు మాని ఢిల్లీలో అన్నదాతలు చేస్తున్న పోరాటం అభినందనీయమని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్ది అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల మీద ఉన్న శ్రద్ద బీజేపీకి రైతుల పోరాటలపై లేదని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల్లో విశ్వసనీయతను కోల్పోయాయని పేర్కొన్నారు. అంబానీ, అదానీల కోసమే కొత్త చట్టాలు తెచ్చారని అన్నారు. ఈ నెల 8న తల పెట్టిన భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త బంద్‌లో ప్రత్యక్షంగా పాల్గొవాలని సూచించారు.

Advertisement

Next Story