- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రాణం పోయిన లంచం ఇవ్వను.. తహశీల్దార్ ఆఫీసులో రైతు సూసైడ్ అటెంప్ట్
దిశ, టేక్మాల్: అధికారులు లంచం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఓ యువ రైతు ఆత్మహత్యకు యత్నించాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలో శనివారం సంచలనం రేపింది. పాపన్నపేట మండలం సీతానగర్ గ్రామానికి చెందిన గొల్ల రమేష్, టేక్మాల్ మండలం గొల్లగూడెం గ్రామ సమీపంలో ఉన్న తన వ్యవసాయ భూమిలో.. గృహ నిర్మాణానికి సంబంధించి రెవెన్యూ అధికారుల అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నాడు.
ఈ క్రమంలో అధికారులు వ్యవసాయ భూమిని కన్వర్షన్ చేసేందుకు డబ్బులు కోసం వేధిస్తున్నారన్న నేపంతో శనివారం టేక్మాల్ తహశీల్దార్ కార్యాలయం ముందు తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకునే ప్రయత్నం చేశాడు. వెంటనే అప్రమత్తమైన అక్కడున్నవారు అతడిని అడ్డుకున్నారు. తాను డబ్బులు ఇచ్చే పరిస్థితుల్లో లేనని, ఎంత బతిమిలాడిన అధికారులు కనికరం చూపించలేదన్నారు. వారి ఒత్తిడిని భరించలేకనే కార్యాలయం ముందే ఆత్మహత్యకు యత్నించినట్టు చెప్పాడు. ప్రాణాలైన తీసుకుంటాను… కానీ ఒక్క పైసా కూడా లంచం ఇవ్వనని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు కలుగజేసుకొని, లంచాలు తీసుకుంటున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
- Tags
- farmer