పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి తిరిగిరాని రైతు

by Aamani |
పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి తిరిగిరాని రైతు
X

దిశ, దండేపల్లి : పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి ఓ రైతు తిరిగిరాని ఘటన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా దండేపల్లిలో ఆదివారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. స్థానిక ఎస్ఐ తాల్ల శ్రీకాంత్ కథనం ప్రకారం.. మండలంలోని కొర్విచెల్మ గ్రామానికి చెందిన చింతం పోచయ్య(55) వ్యవసాయ పనుల నిమిత్తం రోజు మాదిరిగా పొలానికి వెళ్ళాడు.

ఈ క్రమంలోనే విద్యుత్ మోటార్ సవరిస్తుండగా షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే ఎత్తకపోవడంతో అనుమానం వచ్చి వారు పొలం వద్దకు వెళ్లి చూడగా విద్యుత్ మోటార్ పై విగతజీవిగా పడి ఉన్నాడు. విద్యుత్ శాఖ అధికారులకు ఫోన్ చేసి కరెంట్ నిలిపి వేసి చూడగా మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుని కుమారుడు చింతం వేణుగోపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తాల్ల శ్రీకాంత్ తెలిపారు.

Advertisement

Next Story