ధాన్యం కుప్ప వద్దే అన్నదాత ఆత్మహత్య.. రైతుల బాధ తీరేదెలా

by Aamani |   ( Updated:2021-11-08 03:48:52.0  )
ధాన్యం కుప్ప వద్దే అన్నదాత ఆత్మహత్య.. రైతుల బాధ తీరేదెలా
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తాను పండించిన ధాన్యం కొంటారో లేదో అని భయాందోళనకు గురై రైతు ధాన్యం కుప్పపై గుండెపోటు వచ్చి మృతి చెందిన ఘటన మరవక ముందే కామారెడ్డి జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని బాన్సువాడ మండలం హన్మాజీపేట గ్రామంలో సింగం శంకర్ అనే రైతు ఆదివారం అర్ధరాత్రి క్రిమిసంహారక మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. హన్మాజీపేట గ్రామానికి చెందిన సింగం శంకర్ తాను పండించిన మూడు ఎకరాల భూమిలో వర్షాభావ పరిస్థితుల వలన సరి అయిన దిగుబడి రాలేదు. దీంతో పెట్టిన పెట్టుబడులు వరకన్నా డబ్బులు వస్తాయో, లేదోనన్న భయం ఒకవైపు, మరోవైపు తన కూతురు శ్వేత పక్షవాతం వ్యాధితో బాధపడుతుండగా వైద్యం కోసం ఆరు లక్షల రూపాయల ఖర్చు చేశారు. ఈ పంట మీద అయిన సగం అప్పు తీరుతోందన్న ఆశతో ఉండగా దిగుబడి సక్రమంగా రాలేదు, అప్పులు తీరవని భయంతో ఆదివారం రాత్రి ధాన్యం‌కు కాపలాగా వెళ్లి ధాన్యం కుప్ప వద్దనే పురుగులమందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పుల బాధ భరించలేక సింగం శంకర్ ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శంకర్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed