- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళా కొట్టిందని రైతు ఆత్మహత్య.. ఆ గొడవే కారణమా..!
దిశ, మోతె : మహిళ అవమానించిందని రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అందరి ముందు బూతులు తిట్టడంతోపాటు చెప్పుతో దాడి చేయడంతో అవమానంగా భావించి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సూర్యాపేట జిల్లా మోతె మండలం నేరడవాయిలో జరిగిన ఈ ఘటన వివరాలను ఎస్ఐ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. నేరడవాయికి చెందిన దారమల్ల ఉప్పయ్య (50) నవంబర్ 30న తనకున్న రెండు గేదెలను మేపడానికి గ్రామ శివారుకు వెళ్లాడు. అయితే గేదెలు మేస్తూ పక్కన్నే ఉన్న కొర్ర బుజ్జి వరి కల్లంలోని ధాన్యాన్ని తిన్నాయి. దీంతో ఆగ్రహం చెందిన ఆమె ఉప్పయ్యను అసభ్యకరంగా తిట్టడంతోపాటు చెప్పుతో కొట్టింది.
ఈ ఘటనతో తీవ్ర మనస్తాపం చెందిన ఆయన ఇంటికి వచ్చి పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే 108 అంబులెన్స్‌లో సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయన ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా మారడంతో వెంటనే ఖమ్మంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స చేయిస్తున్నారు. అయినా శుక్రవారం ఆయన ఆరోగ్యం విషమించి మృతి చెందాడు. మృతుడి కుమారుడు దారమల్ల శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు.