ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయిన ప్రభాస్.. షాక్‌లో ఫ్యాన్స్

by Shyam |
ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయిన ప్రభాస్.. షాక్‌లో ఫ్యాన్స్
X

దిశ, సినిమా : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ ‘ఆదిపురుష్’. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా కనిపించబోతుండగా బ్యూటిఫుల్ హీరోయిన్ కృతిసనన్ సీతగా నటించనుంది. అయితే శ్రీరామనవమిని పురస్కరించుకుని ఈ మూవీ నుంచి అప్‌డేట్ ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేశారు ఫ్యాన్స్. రాముడి గెటప్‌లో ప్రభాస్ స్టిల్స్ పోస్ట్ చేయాలని కోరారు. దీంతో అనుకున్నట్లుగానే శ్రీరామనవమి(ఏప్రిల్ 21)కి ఒక్కరోజు ముందు అంటే ఏప్రిల్ 20న ‘ఆదిపురుష్’ అనే ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఓ పోస్ట్ వచ్చింది. రేపు ఉదయం 7.11 గంటలకు అప్‌డేట్ ఉంటుందని ఈ హ్యాండిల్ ద్వారా ప్రామిస్ చేశారు. దాంతో అది నిజమే అనుకున్న అభిమానులు అప్‌డేట్ కోసం ఎదురుచూశారు. చెప్పిన టైమ్ గడిచిపోయినా ఎలాంటి పోస్ట్ రాకపోవడంతో ఇదంతా ఫేక్ అని, మేకర్స్ నుంచి వచ్చిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కాదని తెలుసుకుని షాక్‌కు గురయ్యారు.

Advertisement

Next Story