నదిలో కుటుంబం జల సమాధి.. అధికారులను నివేదిక అడిగిన HRC

by Shyam |
నదిలో కుటుంబం జల సమాధి.. అధికారులను నివేదిక అడిగిన HRC
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఇటీవల మంజీర నది దాటుతూ బీర్కూర్ శివారులో ఇసుక కోసం నదిగర్బంలో త్రవ్వకాల కోసం జరిపిన గుంతలో పడి షెట్లూర్ కు చెందిన నలుగురు చనిపోయారు. అయితే వారికి కోటి రూపాయల చొప్పున నష్టపరిహరం ఇవ్వాలని, అక్రమ ఇసుక తవ్వకాలు చేస్తున్న క్వారీ నిర్వహకులపై చర్యలు తీసుకోవాలని మానవహక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేశారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తోండకు చెందిన జాతీయ రైతు సంఘాల సమైక్య తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు సోమశేఖర రావు మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టీస్ చంద్రయ్యకు ఫిర్యాదు చేశారు.

కామారెడ్డి జిల్లాలో మంజీరా నదిలో బీర్కూర్ చెక్ డ్యామ్ పేరిట మంజూరైన 6 ఇసుక క్వారీలలో క్వారీ నిర్వాహకులు నిబంధనలను ఉల్లంఘించి ఎక్కువ లోతుగా తవ్వకాలు చేపట్టడం వల్ల దైవదర్శనానికి వెళ్తూ.. షెట్లూర్ గ్రామానికి చెందిన తల్లితో పాటు ముగ్గురు పిల్లలు జలసమాధి కావడానికి కారకులైన ఇసుక క్వారీ నిర్వాహకులతో పాటు సంబంధిత శాఖ అధికారులపై చర్యలు చేపట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ తవ్వకాలు చేపడుతూ కోట్లాది రూపాయలు ఆర్జించడానికి మంజీరా నదిలో పెద్ద పెద్ద యంత్రాలను పెట్టి 20 నుంచి 30 అడుగుల లోతు తవ్వకాలు జరుపుతూ ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతున్న ఇసుక నిర్వాహకులకు అండగా నిలుస్తున్న పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, ఇరిగేషన్ శాఖ, మైనింగ్ శాఖ అధికారులపై చర్యలు తీసుకుకోవాలని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సోమశేఖర రావు ఇచ్చిన ఫిర్యాదు స్వీకరించిన మానవ హక్కుల కమిషన్ చైర్మన్ చంద్రయ్య స్పందిస్తూ ఈ నెల 25న సంబంధిత శాఖ ఉన్నత అధికారులు, ప్రమాదానికి కారణమైన పూర్తి నివేదికతో మానవ హక్కుల కమిషన్ ఎదుట హాజరు కావాలంటూ చంద్రయ్య ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Next Story