జూమ్‌కి పోటీగా ఫేస్‌బుక్ మెసెంజర్ రూమ్స్

by Harish |   ( Updated:2020-04-25 01:30:51.0  )
జూమ్‌కి పోటీగా ఫేస్‌బుక్ మెసెంజర్ రూమ్స్
X

దిశ, వెబ్‌డెస్క్: సెక్యూరిటీ ఇబ్బందులు ఉన్నాయని తెలిసినప్పటికీ గత కొన్ని వారాలుగా వీడియో మీటింగుల కోసం జూమ్ యాప్‌ని తెగ ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దానికి పోటీగా కొత్తగా ఫేస్‌బుక్ మెసెంజర్‌లో మీటింగ్ పెట్టుకోవడానికి మెసెంజర్ రూమ్స్ అనే ఫీచర్‌ను ఇవాళ లాంచ్ చేసింది. ఇప్పటికే మెసెంజర్‌లో వీడియో కాలింగ్ సదుపాయం ఉన్నప్పటికీ అందులో పాల్గొనే వారి సంఖ్య మీద పరిమితి ఉండేది. అంతేకాకుండా ఇందులో పాల్గొనాలంటే ఫేస్‌బుక్ ఖాతా తప్పనిసరిగా ఉండాలి.

ఇప్పుడు 50 మంది వరకు ఈ మెసెంజర్ రూమ్స్ మీటింగులో పాల్గొనవచ్చు. ఫేస్‌బుక్ ఖాతా లేని వారికి మీటింగు పెడుతున్నవారు ఒక లింక్ పంపించాలి. ఆ లింక్ ద్వారా వాళ్లు రూమ్‌లో చేరొచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా ఇందులో టైమ్ లిమిట్ అంటూ ఏదీ లేదు. అంతేకాకుండా ఫిల్టర్లు, బ్యాక్‌గ్రౌండ్లు వంటి చాలా ఏఆర్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అచ్చం జూమ్ యాప్ మాదిరిగా మీటింగు హోస్ట్‌కే ప్రధాన హక్కులు ఉన్నాయి. కావాలనుకున్నవారిని రూమ్‌లో చేర్చడం, వద్దనుకున్నవారిని తొలగించడం బాధ్యతలు హోస్ట్‌కే ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ఫేస్‌బుక్ గ్రూప్ ద్వారా రూమ్ క్రియేట్ చేస్తే ఆ గ్రూపులో ఉన్నవాళ్లందరూ పాల్గొనొచ్చు. అయితే ఈ ఫీచర్‌కి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ లేకపోవడంతో సెక్యూరిటీ సమస్యలు తలెత్తవచ్చు. అయితే భవిష్యత్తులో ఈ ఎన్క్రిప్షన్ తీసుకొస్తామని ఫేస్‌బుక్ ప్రకటించింది. ప్రస్తుతానికి కొన్ని దేశాల్లో మాత్రమే మెసెంజర్ రూమ్స్ అందుబాటులో ఉన్నప్పటికీ రానున్న వారాల్లో ప్రపంచమంతటా విడుదల చేయనున్నట్లు ఫేస్‌బుక్ వెల్లడించింది.

Tags: facebook, messenger rooms, securty, video calling, meeting, covid, lockdown

Advertisement

Next Story