ఫేస్‌బుక్ ‘లైవ్ ఆడియో రూమ్స్‌’తో క్లబ్‌హౌస్‌కు ముప్పు

by Shyam |
Facebook-Live-Audio-Rooms
X

దిశ, ఫీచర్స్ : క్రమంగా పాపులారిటీ పెంచుకుంటున్న ఆడియో చాట్ యాప్ ‘క్లబ్‌హౌస్’కు కొత్త చిక్కు ఎదురైంది. ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్.. ‘ఆడియో రూమ్స్’ పేరుతో క్లబ్‌హౌస్‌ను పోలివుండే ఫీచర్‌ను విడుదల చేయగా.. త్వరలోనే పాడ్‌కాస్ట్స్ యాడ్ చేసేందుకు సిద్ధమవుతోంది. కాగా ఫేస్‌బుక్‌లోని లైవ్ ఆడియో రూమ్స్.. ప్రత్యక్ష సంభాషణలు వినేందుకు వీలుగా యూజర్లకు యాక్సెస్ ఇస్తున్నందున క్లబ్‌హౌస్‌కు గట్టి పోటీ ఎదురుకానుంది. ప్రారంభ యూజర్లలో పబ్లిక్ ఫిగర్స్‌తో పాటు ఐవోఎస్‌‌పై సెలెక్టెడ్ ఎఫ్‌బీ గ్రూప్స్‌కు మాత్రమే ఆడియో రూమ్స్ క్రియేట్ చేసుకునే వీలు కల్పించినా.. ఈ రూమ్స్‌లో ఐవోఎస్‌తో పాటు ఆండ్రాయిడ్‌ డివైసెస్‌ గల యూజర్లు కూడా జాయిన్ కావచ్చు. అయితే ఆడియో రూమ్స్ క్రియేట్ చేసుకునే అవకాశాన్ని ప్రస్తుతానికి యూఎస్ యూజర్లకు కల్పించలేదు.

ఈ లైవ్ ఆడియో రూమ్ కండక్ట్ చేసే హోస్ట్‌లు.. 50 మందితో కన్వర్జేషన్‌ను కొనసాగించవచ్చు. కాగా ఇప్పటికే టోకిమోన్‌స్టా(గ్రామీ-నామినేటెడ్ ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ఆర్టిస్ట్), అమెరికన్ ఫుట్‌బాలర్ రసెల్ విల్సన్, స్కాలర్ యాక్టివిస్ట్ రోసా క్లెమెంట్ తదితరులు ఆడియో రూమ్స్‌లో పాల్గొన్నారు. ఇందులో 50 మందిని స్పీకర్లుగా ఇన్‌వైట్ చేసే వీలుండగా.. శ్రోతల సంఖ్యకు పరిమితి లేదు(క్లబ్‌హౌస్‌కు పరిమితి ఉంది). ఇక పబ్లిక్ గ్రూప్స్ విషయానికొస్తే.. లిజనర్స్, స్పీకర్స్ ఇద్దరూ ఆడియో వినవచ్చు. కానీ ప్రైవేట్ గ్రూప్స్‌లో స్పీకర్స్‌కు మాత్రమే ఆ చాన్స్ ఉంది.

ఇక యూజర్లు.. ఈ లైవ్ ఆడియో రూమ్స్‌ను న్యూస్ ఫీడ్, ఫేస్‌బుక్ నోటిఫికేషన్స్ ద్వారా తెలుసుకోవచ్చు. అంతేకాదు ఇందుకు సంబంధించి లైవ్ ప్రోగ్రామ్ కోసం రిమైండర్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఈ టైమ్‌లో ఏదైనా మాట్లాడాలనుకుంటే క్లబ్‌హౌస్ తరహాలోనే ‘రైజ్ ఏ హ్యాండ్’ అనే ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. స్నేహితులు లేదా ఫాలోవర్స్ చాట్‌లో జాయిన్ అయితే నోటిఫికేషన్స్ ద్వారా తెలుస్తుంది. అన్నింటికంటే మించి లైవ్ ఆడియో రూమ్స్‌పై లైవ్ క్యాప్షన్ చేసే ఫీచర్ ఉండటం విశేషం. ఇది క్లబ్‌హౌస్‌లో లేకపోవడం గమనార్హం.

ఈ తరహా ఆడియో మార్కెట్‌లో పోటీని ఎదుర్కొనేందుకు ‘యాపిల్, స్పాటిఫై’ మాదిరిగా ఫేస్‌బుక్.. తన ప్లాట్‌ఫామ్‌పై పాడ్‌కాస్ట్స్ కూడా యాడ్ చేయడం ప్రారంభించింది. యూజర్లు ‘మినీ లేదా ఫుల్ స్క్రీన్ ప్లేయర్’ ఉపయోగిస్తూ ఫేస్‌బుక్‌లో స్క్రోలింగ్ చేస్తూ కూడా ఈ పాడ్‌కాస్ట్స్‌ వినవచ్చు. వీటిని క్రియేటర్స్ ఫేస్‌బుక్ పేజీతో పాటు న్యూస్ ఫీడ్‌పైనా చూడొచ్చు. అంతేకాదు స్క్రీన్ ఆఫ్‌లో ఉన్నప్పుడు కూడా పాడ్‌కాస్ట్స్ వినేందుకు యూజర్లకు సెపరేట్ ఆప్షన్ ఉంది. ప్రస్తుతం ప్రారంభ యూజర్లకు పాడ్‌కాస్ట్స్ కలెక్షన్ ఎక్కువ సంఖ్యలో లేకున్నా.. త్వరలోనే వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు ఫేస్‌బుక్ ప్రయత్నిస్తోంది.

Advertisement

Next Story