వివేకానంద విదేశీ విద్యాపథకం దరఖాస్తు గడువు పెంపు

by Shyam |
Vivekananda Overseas Education Scheme
X

దిశ, తెలంగాణ బ్యూరో : బ్రాహ్మణ విద్యార్థులకు విదేశీ విద్యను అభ్యసించేందుకు ప్రవేశపెట్టిన వివేకానంద విదేశీ విద్యా పథకంను దరఖాస్తు గడువును తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ జూన్ 18 వరకు పెంచింది. ఈ నెల 28వ తేదీ చివరి తేదీ కాగా లాక్ డౌన్ నేపథ్యంలో విద్యార్థులకు కుల, ఆదాయ, ధ్రువీకరణ పత్రాలు, విదేశీ యూనివర్సిటీల నుంచి ఐ-20 లెటర్లు తీసుకోవడంలో ఆలస్యమవుతున్నందని తెలిపారు.

అర్హత కలిగి దరఖాస్తు చేసుకోని అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గడువు పెంచినట్లు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అడ్మినిస్ట్రేటర్ కె. చంద్రమోహన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వెబ్ సైట్ WWW.brahminparishad.telangana.gov.in దరఖాస్తు చేసుకోవాలని వివరించారు.

Advertisement

Next Story