ముంపు బాధితులకు ఊరట.. పరిహారం ఇచ్చేందుకు అధికారుల ఇన్‌స్పెక్షన్

by Shyam |
ముంపు బాధితులకు ఊరట.. పరిహారం ఇచ్చేందుకు అధికారుల ఇన్‌స్పెక్షన్
X

దిశ, మల్హర్: పెద్దతూడ్ల తీగల వాగు ప్రాజెక్టులో ముంపునకు గురయ్యే బాధితులకు.. పరిహారం చెల్లించడానికి శనివారం ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు పరిశీలనకు వచ్చారు. నిర్మాణం చేపట్టిన ప్రాజెక్టుకు భారీ వర్షాల కారణంగా గండి పడింది. దీంతో మళ్లీ ప్రాజెక్టు నిర్మాణం చేపడితే ముంపునకు గురయ్యే 84.38 ఎకరాల వ్యవసాయ భూమిలోని పంటలు, బోరుబావులు, వివిధ రకాల చెట్లు పరిశీలించి ఏ రైతుకు ఎంత నష్టం జరుగుతుందని రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల ఆధ్వర్యంలో జాయింట్ సర్వే నిర్వహించారు. ప్రాజెక్టు నిర్మాణం ద్వారా ముంపునకు గురయ్యే బాధిత రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చేందుకు ఈ జాయింట్ సర్వే చేసినట్లు ఇరిగేషన్ డీఈ మధుసూదన్, ఆర్డీఓ శ్రీనివాస్ తెలిపారు. వీరి వెంట తహసీల్దార్ శ్రీనివాస్, ఏఈ రంజిత్, ఎడబ్ల్యూఈ సారయ్య, డీఐ రాజనర్సు, ఆర్ఐ సరితాలతో పాటు స్థానిక రైతులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed