‘ఆ ఘనత రాజీవ్ గాంధీదే’

by Shyam |
‘ఆ ఘనత రాజీవ్ గాంధీదే’
X

దిశ, నిజామాబాద్: రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చి రాజ్యాంగ విలువను పెంచితే.. నేటి పాలకులు ఆ మహోన్నతమైన చట్టానికి తూట్లు పొడుస్తూ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతూన్నారని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి విమర్శించారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నేతలు ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. 18 సంవత్సరాలకు ఓటుహక్కు కల్పించి భారత జాతి నిర్మాణంలో యువకులను క్రియాశీలం చేసిన ఘనత రాజీవ్ గాంధీదే అని నాయకులు కొనియాడారు. సీఎం కేసీఆర్ కూతురు కవిత గెలుపు కోసం టీఆర్ఎస్ నేతలు నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

Advertisement

Next Story