ఈటల బీజేపీలోకి వస్తే ఉప్పెన తప్పదు.. వార్నింగ్ ఇచ్చిన మాజీ మంత్రి

by Anukaran |   ( Updated:2021-05-27 04:55:40.0  )
ఈటల బీజేపీలోకి  వస్తే ఉప్పెన తప్పదు.. వార్నింగ్ ఇచ్చిన మాజీ మంత్రి
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీలోకి ఈటల చేరుతున్నారని వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజేందర్‌ను పార్టీలోకి తీసుకుంటే మరో ఉప్పెన తప్పదని.. తనను సంప్రదించకుండా ఎలా ఆహ్వానించారని రాష్ట్ర నాయకులపై మండిపడ్డారు. హైదరాబాద్‌లోని మాజీ ఎంపీ వివేక్ ఫామ్‌ హౌస్‌లో చర్చలు జరిపిన నాయకులకు.. సొంత పార్టీ నేతలు గుర్తుకు రాకపోవడం ఏంటని నిలదీశారు. ఇప్పటికే ఈటలతో పలుసార్లు చర్చలు జరిపారని.. అప్పుడు ఒక్కసారి అయినా తనకు చెప్పకపోవడం దారుణమన్నారు. అయినా.. ఈటల రాజేందర్‌కు ఒక వర్గం వారు మాత్రమే సపోర్ట్ చేస్తున్నారని.. మిగతావారు అంతగా ఆసక్తి చూపడం లేదని మాజీ మంత్రి పెద్దిరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story