- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చర్చకు నేనే ఏర్పాట్లు చేస్తా.. వచ్చే దమ్ముందా.. హరీష్‌కు ఈటల సవాల్
దిశ ప్రతినిధి, కరీంనగర్: మంత్రి హరీష్ రావుపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గురువారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో ఈటల మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నువ్వో రబ్బర్ స్టాంపువి. సొంత పార్టీ నేతలను అంగట్లో సరుకులా కొంటున్న నీచుడివి. నువ్వు హీరోవి కాదు. అర్ధరాత్రి మా నాయకుల ఇళ్లకు దొంగలా వచ్చి బెదిరింపులకు పాల్పడుతూ.. నీచానికి దిగజారావు.’’ అంటూ హరీష్ రావుపై ఈటల ఘాటు వ్యాఖ్యలు చేశారు.
‘‘హరీష్ నువ్వు, నీ మామ ఇద్దరూ కలిసి కాళ్ళు పైకి పెట్టి జపం చేసినా.. టీఆర్ఎస్‌కు ఘోరీ కట్టడం ఖాయం. నేను కుంకుమ భరిణలు పంచినట్టు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా.. లేదంటే నువ్వు రాస్తావా’’ అంటూ సవాల్ విసిరారు. అభివృద్ధిపై హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బహిరంగ చర్చకు రెడీనా అని ఈటల ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారుడిగా, ట్రబుల్ షూటర్‌గా హరీష్ రావుకు ఉన్న పేరు కూడా పోయిందన్నారు. ‘‘నీ మామ మాయలో పడి నా మీద ఆరోపణలు చేస్తే నీ రాజకీయ జీవితాన్ని బొందపెట్టడం ఖాయం’’ అని హరీష్ రావును హెచ్చరించారు. ‘‘నీ మాటల్లోని వ్యంగ్యం, అబద్ధం, ఇతరుల ఆత్మ గౌరవాన్ని కించపరిచే పద్దతి ఆపకపోతే, నీ చరిత్ర ప్రజలకు చెప్పే పరిస్థితి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. హుజురాబాద్‌లో ‘డబుల్ ఇండ్లు’ కట్టలేదన్న ఆరోపణలతో పాటు అభివృద్ధి విషయంలో బహిరంగ చర్చకు రావాలని, అంబేద్కర్ చౌరస్తాలో చర్చకు అన్ని ఏర్పాట్లు తానే చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హయాంలో ఏసీడీపీ నిధులు మంజూరు చేసేవారని, ఇప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఆ నిధులు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని అన్నారు.
‘‘ఏసీడీపీ నిధులు రూ.5 కోట్లు మంత్రి దగ్గర పెట్టి ఎమ్మెల్యేలకు విలువ లేకుండా చేసింది మీరు కాదా?’’ అని ప్రశ్నించారు. హుజూరాబాద్ ప్రజలు హరీష్‌పై ‘‘తూ’’ అని ఉమ్మి వేస్తున్నారని తెలిపారు. నాకు అనుకూలంగా ఉన్న వారిని బెదిరించి, మభ్యపెట్టి టీఆర్ఎస్‌లో చేర్పించుకుంటున్నారని విమర్శించారు. తాను ఉద్యోగంలో పెట్టించిన వాళ్లను సైతం తొలగిస్తున్నారని, కులసంఘాల వారిని బెదిరిస్తున్నారని, మల్లన్నపల్లిలో యాదవ సంఘం అధ్యక్షుడిపై ఒత్తిడి చేస్తే తట్టుకోలేక పదవికి రాజీనామా చేశాడన్నారు. ‘‘హరీష్ నువ్వు కళ్ళు ఉన్న కబోదివా’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత, సంతోష్‌లే రాష్ట్రాన్ని సాధించినట్లుగా వ్యవహరిస్తున్నారని ఈటల ఆరోపించారు.
గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల మధ్యలో ఉన్న దుబ్బాకకు నిధులు ఇవ్వడం లేదనే అక్కడి ప్రజలు మీకు కర్రు కాల్చి వాత పెట్టారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో ఎమ్మెల్యేకు 1400 డబుల్ ఇండ్లు మాత్రమే ఇచ్చారని, తాను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో సర్వే చేసి 3900 డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయించుకున్నానని అన్నారు. వాటిలో హుజూరాబాద్‌లో 500, జమ్మికుంటలో 500, ఇళ్లందకుంటలో 500 కట్టించానని అన్నారు. చిల్లర ఆరోపణలు చేస్తే చరిత్రలో నీచుడిగా మిగిలిపోతావన్న విషయం గుర్తుపెట్టుకోవాలని ఈటల హరీష్ రావుకు హితవు పలికారు. 2015 నుండే కేసీఆర్ నిరంకుశ వ్యవహారం మొదలైందని, మొదట అవమానానికి గురైంది కూడా హరీష్ రావే అని గుర్తుచేశారు. ‘‘నేను మాట్లాడితేనే రెండోసారి నీకు మంత్రి పదవి వచ్చిందన్న విషయం హరీష్ రావు మర్చిపోవద్దన్నారు. నేను రోశం, నిజాయితీ ఉన్నవాడిని, నాకు డ్రామాలు రావు, నా మీద ఆరోపణలు చేస్తే సూర్యుని మీద ఉమ్మి వేయడమే’’ అన్నారు. నాతో గోక్కున్నవాడు ఎవడూ బాగు పడలేదని ఈటల అన్నారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకులు జీ.వివేక్, బొడిగె శోభ, ఎండల లక్ష్మీనారాయణ, ఏనుగు రవిందర్ రెడ్డిలు పాల్గొన్నారు.