ఫిదా చేసిన అపర్ణా బాలమురళి

by Shyam |   ( Updated:2020-11-15 06:58:07.0  )
ఫిదా చేసిన అపర్ణా బాలమురళి
X

దిశ, వెబ్‌డెస్క్: పాత్ర కోసం ఎంత కష్టపడ్డానికైనా సిద్ధపడే నటుల్లో సూర్య ఒకరు. తన మొదటి చిత్రం నుంచి ఇటీవలే విడుదలైన ‘ఆకాశం నీ హద్దురా’ వరకు ఆయన పోషించిన పాత్రలు, అందుకు ఆయన పడ్డ కష్టం తెరమీద తప్పక కనిపిస్తుంది. నటనలో సూర్య ది బెస్ట్ ఔట్‌పుట్ ఇస్తుంటాడు. మరి సూర్యకు దీటుగా, ఒకానొక సందర్భంలో సూర్యను డామినేట్ చేసేలా నటించి, అందరి ప్రశంసలందుకుంటోంది అపర్ణా బాలమురళి. ఆకాశం నీ హద్దురా చిత్రంలో అపర్ణ నటనకు అందరూ ఫిదా అవుతున్నారు.

2017లో విడుదలైన ‘8 తొట్టాక్కుల్’ అనే చిత్రం ద్వారా కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అపర్ణ.. ఆ తర్వాత జీవీ ప్రకాశ్ హీరోగా వచ్చిన ‘సర్వం తాళ మయం’తో పాటు మరో రెండు చిత్రాల్లో నటించినా, ఆమెకు సరైన బ్రేక్ ఇవ్వలేకపోయాయి. కాగా తాజాగా సూర్యతో చేసిన ‘ఆకాశం నీహద్దురా’ అపర్ణలోని నటిని ఆవిష్కరించింది. ఈ సినిమాలో తన పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత యూత్ ఆమెతో ప్రేమలో పడిపోయారు. సాధారణంగా పాత్రలో పరకాయం ప్రవేశం చేసే సూర్య నటన ముందు ఎవరైనా తేలిపోవాల్సిందే. అలాంటిది ఈ సినిమాలో అపర్ణ.. సూర్యను డామినేట్ చేసేలా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది.

కేరళలో జన్మించిన అపర్ణ తల్లిదండ్రులు.. బాలమురళి, శోభా బాలమురళి. ఆమె తండ్రి మ్యూజిక్ డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకోగా, తల్లి లాయర్‌గా పనిచేస్తోంది. ఆమె పలు మళయాల సినిమాల్లో ప్లే బ్యాక్ సింగర్‌గా పాటలు కూడా పాడింది. అపర్ణ కూడా స్వతహాగా మంచి గాయని. సంప్రదాయ నృత్యాలైన భరత నాట్యం, కూచిపూడి, మోహినిఅట్టంలో తనకు మంచి ప్రావీణ్యం ఉంది.

మళయాలంలో 8 సినిమాలు :
25 ఏళ్ల అపర్ణ మళయాల సినీ పరిశ్రమలో తనదైన గుర్తింపు తెచ్చుకుంది. 12 చిత్రాల్లో నటించిన అపర్ణకు ‘యాత్ర తుడరున్న, ఒరు సెకండ్ క్లాస్ యాత్ర, మహేషింటే ప్రతీకారం, మిస్టర్ అండ్ మిసెస్ రౌడీ’ చిత్రాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

తమిళ్‌లో తొలి బ్రేక్ రావడంతో, మంచి కథలను ఎంచుకొని చిత్రాలను చేయాలని అపర్ణ భావిస్తోంది. తమిళ్‌లో ప్రస్తుతం ఏ చిత్రానికి కూడా ఆమె సైన్ చేయలేదు. కాగా మళయాలంలో రెండు చిత్రాల్లో నటిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed