ఈటల షాకింగ్ డెసిషన్.. మరోసారి రాజీనామా..!

by Anukaran |   ( Updated:2021-06-15 20:41:32.0  )
etala rajender
X

దిశ, తెలంగాణ బ్యూరో : మాజీ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్ష పదవికి మంగళవారం రాజీనామా చేశారు. ఈ విషయాన్ని సొసైటీ కార్యదర్శి బి. ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. 2014 నుంచి సొసైటీకి అధ్యక్షుడిగా ఈటల పనిచేస్తున్నారని, వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారని వెల్లడించారు. ఎగ్జిబిషన్ సొసైటీ మేనేజింగ్, కమిటీ సభ్యులు సొసైటీ మరియు విద్యాసంస్ఠల అభివృద్ధిలో ఆయన సహకారాన్ని గుర్తించి గతంలో ఈటలను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారని తెలిపారు.

Advertisement

Next Story