- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హుజురాబాద్‌లో ఇక కురుక్షేత్రమే.. టీఆర్ఎస్‌కు ‘ఈటల’ అల్టిమేటం
దిశ, వెబ్‌డెస్క్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి అల్టిమేటం జారీచేశారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ఇక జరిగేది కురుక్షేత్రమే అని కుండబద్దలు కొట్టారు. మంగళవారం నియోజకవర్గంలోని శంభునిపల్లె, కమలాపూర్, కానిపర్తి గ్రామాల్లో ఈటల బల ప్రదర్శన కోసం రోడ్ షో నిర్వహించారు. ఈటల పర్యటన సందర్భంగా ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్బంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడుతూ.. ప్రజలు తన వెంటనే ఉంటానని హామీ ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఇక టీఆర్ఎస్ పార్టీతో మరో యుద్ధానికి హుజురాబాదే నాంది పలుకనుందని ఈటల వెల్లడించారు.
తన ప్రజలను అవమానిస్తే తగిన బుద్దిచెబుతామని హెచ్చరించారు. హుజురాబాద్ విజయమే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని స్పష్టంచేశారు. నియోజకవర్గ ప్రజలు తనను గుండెల్లో పెట్టుకుంటున్నారని, కేసీఆర్‌కు బుద్ది చెబుతామని ప్రజలు అంటున్నారని వివరించారు. తమపై దాడులు చేసినా ప్రజలను కొనలేరని మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. సీఎం క్యాంప్ ఆఫీసు ఇచ్చిన స్క్రిప్ట్‌తోనే మంత్రులు, లీడర్లు మాట్లాడుతున్నారని ఈటల విమర్శలు గుప్పించారు. ఈటలకు ప్రజల్లో విశేష స్పందన లభించడంతో పాటు ప్రజలు తన వెంటనే ఉంటారని హామీ ఇవ్వడంతో ఆయన రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.