బిగ్‌న్యూస్.. కేసీఆర్‌కు ఈటల రాజేందర్ సంచలన సవాల్

by Anukaran |
బిగ్‌న్యూస్.. కేసీఆర్‌కు ఈటల రాజేందర్ సంచలన సవాల్
X

దిశ, జమ్మికుంట: హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ మండలం సిర్శపల్లిలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్లను గురువారం పరిశీలించిన ఈటల.. సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉపఎన్నికలో తాను గెలిస్తే సీఎం కేసీఆర్ పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. తెలంగాణ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి నెరవేర్చకుండా.. మోచేతికి బెల్లం పెట్టి అరచేతిని నాకించే విధంగా ముఖ్యమంత్రి తీరు ఉందంటూ విమర్శించారు. కేసీఆర్ ఇచ్చిన మాటలకు, చేతలకు పొంతన ఉండదని ఈటల రాజేందర్ దుయ్యబట్టారు.

Advertisement

Next Story

Most Viewed