- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి ‘ఈటల’ మా భూముల్లో రోడ్లు వేశారు : బాధిత రైతులు
దిశ, వెబ్‌డెస్క్ : మెదక్ జిల్లా మాసాయి పేట మండలం అచ్చంపేటలో గల తమకు చెందిన వ్యవసాయ భూముల్లో ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ బలవంతంగా రోడ్లు వేయించారని బాధిత రైతులు ఆరోపించారు. తమ భూముల పక్కన ఏర్పాటు చేసిన పౌల్ట్రీ ఫాం హ్యచరీ కోసం తమ భూముల హద్దులు చెరిపేసి ఈటల అనుచరులు కబ్జాకు పాల్పడ్డారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి పేరిట ఉన్న భూమిని కబ్జా చేశారని, పత్రాలు తన వద్దే ఉన్నా బెదిరిస్తున్నారని ఓ రైతు మీడియా ముందు వాపోయాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు వెళితే తమకు న్యాయం జరుగుతుందని బాధిత రైతులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.
రోడ్డు వేస్తున్న సమయంలో ప్రశ్నించినందుకు పోలీసులతో పాటు మంత్రి అనుచరులు కూడా బెదిరిస్తున్నారని బాధిత రైతులు చెబుతున్నారు. కొందరికి కొంత మేర డబ్బులు ఇచ్చి, బెదిరించి లాక్కున్నట్లు పేర్కొన్నారు. ఫౌల్ట్రీ ఫాం ఏర్పాటులో ఊరిలో తీవ్ర దుర్వాసన వస్తోందని, రూ.40 లక్షలున్న భూమికి రూ.10 లక్షలు ఇచ్చి లాక్కున్నట్లు బాధితులు తమ గోడును వెల్లగక్కారు. ఉద్యోగాల ఆశచూపి కూడా కొందరు రైతుల భూములు లాక్కున్నట్లు రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.