కరోనాకు సంబంధించిన 57 లక్షల క్లెయిమ్‌ల పరిష్కారం!

by Harish |
కరోనాకు సంబంధించిన 57 లక్షల క్లెయిమ్‌ల పరిష్కారం!
X

దిశ, వెబ్‌డెస్క్: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) గతేడాది డిసెంబర్ 31 నాటికి మొత్తం 56.79 లక్షల కొవిడ్-19 క్లెయిమ్‌లను పరిష్కరించింది. ఈ క్లెయిమ్‌లన్నీ నాన్-రీఫండబుల్ అడ్వాన్స్ క్లెయిమ్‌లే, అలాగే వీటికి సంబంధించి రూ. 14,310 కోట్లను విడుదల చేసింది. వ్యవస్థీకృత రంగంలోని ఉద్యోగులు కరోనా వల్ల ఏ స్థాయిలో ఇబ్బందులు పడ్డారో ఈ క్లెయిమ్‌లే రుజువని తెలుస్తోంది. గతేదాది మార్చి నెలలో లాక్‌డౌన్ విధించిన తర్వాత ఉద్యోగులు ఈపీఎఫ్ఓ నుంచి నిధులను తీసుకునేందుకు అనుమతి లభించింది. లాక్‌డౌన్ సమయంలో ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం కోసం ఈ అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. దీని ప్రకారం..ఉద్యోగి మూడు నెలల బేసిక్‌తో పాటు డీఏ మించకుండా ఉండాలి. ఇదే సమయంలో గతేడాది మొత్తంలో ఈపీఎఫ్ఓ సంస్థ మొత్తం 1.97 కోట్ల క్లెయిమ్‌లను సెటిల్ చేసినట్టు తెలుస్తోంది. వీటిలో మరణాలు, బీమా, అడ్వాన్స్ క్లెయిమ్, సెటిల్‌మెంట్‌లు ఉన్నాయి. ఈ క్లెయిమ్‌ల మొత్తం రూ. 73,288 కోట్లను చెల్లించినట్టు సమాచారం. ఈ మొత్తం క్లెయిమ్‌లలో కరోనాకు సంబంధించినవి మాత్రమే ఐదో వంతు ఉన్నాయి. కరోనా ప్రభావంతో వ్యవస్థీకృత రంగంలో ఎక్కువమంది ఉద్యోగులను కోల్పోవడం, వేతనాలు తగ్గడం లాంటి పలు కారణాల నేపథ్యంలో క్లెయిమ్‌ల సంఖ్య భారీగా పెరిగాయి.

Advertisement

Next Story