5274 ప్రాంతాల్లో హైపో క్లోరైట్ స్ప్రే

by Shyam |   ( Updated:2020-04-01 07:22:38.0  )
5274 ప్రాంతాల్లో హైపో క్లోరైట్ స్ప్రే
X

దిశ, న్యూస్‌బ్యూరో:
కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం నిర్విరామంగా కృషి చేస్తోంది. నగరవ్యాప్తంగా సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని స్ప్రే చేస్తున్నది. ఎంటమాలజీ విభాగంలో 125 యూనిట్స్, 2,375 మంది వర్కర్లు పనిచేస్తున్నారు. వీరంతా అన్ని క్వారంటైన్ కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో స్ప్రే చేస్తున్నారు. కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాల్లోనైతే రెండు, మూడు సార్లు స్ప్రే చేస్తున్నారు. స్ప్రేయింగ్‌కు వెయ్యి పవర్ స్ప్రేయర్లు, 63 వీఎంఎఫ్ పెద్ద స్ప్రేయర్లు అందుబాటులో ఉండగా.. ప్రతి వీఎంఎఫ్ స్ప్రేయర్ ద్వారా రోజుకు 15 కిలోమీటర్లు స్ప్రే చేస్తున్నారు. మార్చి 22 నుంచి ఏప్రిల్ 1 వరకు 5724 ఏరియాల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేసినట్టు చీఫ్ ఎంటమాలజీ అధికారి రాంబాబు తెలిపారు. నగరంలోని 150 సర్కిళ్లలో నిర్వహిస్తున్న పిచికారీ పనులను ముగ్గురు సీనియర్, 17 అసిస్టెంట్ ఎంటమాలజిస్టులు పర్యవేక్షిస్తున్నారని ఆయన వివరించారు.

Tags: spraying, Corona prevention, Entomology, Entomologists

Advertisement

Next Story